Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Dec 22, 2025

Version Conflict: *శ్రద్ధా శ్రీనాధ్ నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్సన్ "కలియుగమ్ 2064" సెన్సార్ పూర్తి !!!*





ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో అలాగే పాపులర్ నటుడు కిషోర్ మరొక కీలక పాత్రలో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన "కలియుగం 2064" సినిమా తెలుగు, తమిళ్ బైలింగవ్వల్ మూవీగా తెరకెక్కుతోంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

అసలే కలియుగం ఆపై 2064... ఆ ఫ్యూచర్లో మనుష్యులు ఎలా ఉండబోతున్నారు ఎలా బ్రతుకబోతున్నారు ఎలా చావబోతున్నారు... అనే అంశాలతో... ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది,
తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో యాక్ట్ చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుని , తెలుగులో హీరో నాని తో జెర్సీ, విక్టరీ వెంకటేష్ సైoధవ్ , విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, నందమూరి బాలకృష్ణ డాకు మహరాజ్ చిత్రాల్లో నటించిన చేసిన శ్రద్ధా శ్రీనాథ్ ఈ మూవీ లో మరో విభిన్నమైన పాత్రలో నటించింది. ప అలాగే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన ప్రాత్రాల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీ లో మరో కీలకమైన పాత్రలో చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ...
"ఈ మూవీ లో కంటెంట్ చాలా ముఖ్యమైనదని , ఫ్యూచర్ పీరియాడిక్ మూవీ గా రూపొందిందిన ఈ మూవీ ఇప్పటి జెనరేషన్ కి చాలా అవసరమని , ఇది యువత ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ అని , ఈ మూవీని అందరూ చూసి , మా ఈ క్రొత్త ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుతున్నామని అలాగే , ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని దర్శకులు మణిరత్నం విడుదల చేశారని, మంచి స్పందన లభించిందని, ఈ వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని" తెలిపారు.

Shraddha Srinath’s Kaliyugam 2064 movie completed it's censor formalities  !!!

No comments:

Post a Comment